గ్రామ ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్ గ్రామంలో సర్పంచ్ బానోతు నిర్మల వెంకన్న ఆధ్వర్యంలో గ్రామ ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించారు. గ్రామ ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ఇకపై ప్రతి సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ప్రజావాణి నిర్వహిస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి భారతి, తదితరులున్నారు.