ఘనంగా జాతీయ న్యాయ సేవల దినోత్సవం
VZM: ఎస్‌కోటలోని శ్రీ వివేకానంద కళాశాలలో ఆదివారం మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి కనకలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. మండల న్యాయ సేవ కమిటీల ద్వారా ఉచితంగా న్యాయ సహాయాన్ని పొందాలని సూచించారు.