'జీవితంలో ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలి'
WNP: జీవితంలో ఏ రంగాన్నైనా ఇష్టంగా ఎంచుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకొని పని చేస్తే తప్పక విజయం సాధిస్తామని తెలిపారు. బాల బాలికలు టైంపాస్ కోసం క్రీడలు ఆడొద్దని, ఓలక్ష్యంతో ఆడితేనే గోల్ సాధించవచ్చని హితవు పలికారు. మీరు క్రీడల్లో పాల్గొంటే ప్రపంచం మీవైపు చూస్తుందన్నారు. వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని మంత్రి సూచించారు.