నగదు చోరీ.. కేసు నమోదు
KDP: పెద్దముడియం మండల పరిధిలోని సుద్దపల్లె గ్రామంలో సింగం వెంకట లక్ష్మమ్మ ఇంటిలోని రూ. 3.5 లక్షల నగదు చోరీకి గురైనట్లు లక్ష్మమ్మ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 2న వెంకట లక్ష్మమ్మ కూలిపనికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం, బీరువాను పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసినట్లు SI సుబ్బారావు తెలిపారు.