'ఏకగ్రీవమైన గ్రామాల అభివృద్ధికి నిధులు అందజేస్తాం'
VKB: చౌడాపూర్ మండలం నీరసబ్ తండా గ్రామ సర్పంచ్‌గా కడవత్ నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. MLA రామ్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏకగ్రీవమైన గ్రామాల సర్పంచులకు అభివృద్ధి కోసం నిధులు అందజేస్తామని హామీ ఇచ్చారు. సాధ్యమైనంతవరకు గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.