మరో 5 లక్షలకు పైగా ఇండక్షన్ స్టవ్‌ల సరఫరా
LPG కొరతతో దేశంలోని ఎక్కువ మంది ప్రజలు ఇండక్షన్ స్టవ్‌లకు మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలో ఈ స్టవ్‌ల స్టాక్ కూడా ఖాళీ అవ్వడంతో గిరాకీకి తగ్గట్లుగా సరఫరాను పెంచేందుకు EESL చర్యలు చేపట్టింది. రెండు విడతల్లో 5 లక్షల ఇండక్షన్ స్టవ్‌ల సరఫరా కోసం కొత్తగా టెండర్లను పిలవనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే లక్ష స్టవ్‌ల టెండర్లను పూర్తి చేసినట్లు చెప్పాయి.