నూతన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా CITU ఆందోళన

నూతన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా CITU ఆందోళన

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా సీఐటీయు కార్యకర్తలు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్న చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని నినాదాలు చేశారు. CITU మండల కార్యదర్శి ఉపేందర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేసి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.