ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

TPT: తిరుపతిలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని విగ్రహానికి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ గారి సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.