పశువుల పాకలో రక్త పింజర కలకలం
ADB: బోథ్ సమీపంలో ఉన్న రైతుల పశువుల పాకల్లో విషషర్పాలు కలకలం రేపుతున్నాయి. బుధవారం ఓ రైతు వ్యవసాయ భూమిలోని పశువుల పాకలో దాదాపు ఆరు అడుగుల పొడవైన రక్త పింజర పాము కనపడడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే చుట్టు పక్కల ఉన్న రైతులకు తెలపడంతో పామును వెతికి చంపారు. రైతులు మాట్లాడుతూ.. పశువుల పాకలో పని చేసేటప్పుడు అలికిడి చేస్తూ పని చేయాలని సూచించారు.