'ప్రజావాణి దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలి'

'ప్రజావాణి దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలి'

SDPT: కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్లు గరిమా అగ్రవాల్, అబ్దుల్ హమీద్‌లతో కలిసి ప్రజల వినతులను స్వీకరించారు. తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో వచ్చిన ప్రజల దరఖాస్తులను అధికారులు సత్వరంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 152 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.