VIDEO: విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి శంకుస్థాపన
కృష్ణా: గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో రూ. 36 లక్షల నిధులతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు సహకారంతో గుడివాడ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు.