వడదెబ్బకు గురై ఉపాధి కూలీ మృతి
SRCL: వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన కోనరావుపేట మండలం కనగర్తిలో నిన్న జరిగింది. తోటి కూలీల వివరాలు.. గ్రామానికి చెందిన పులి రవి (38) రోజులానే ఉపాధి పనులకు వెళ్లాడు. పని పూర్తై ఇంటికి తిరిగి వస్తుండగా వడదెబ్బకు గురయ్యాడు. గమనించిన తోటి కూలీలు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.