శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..?

శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..?

TPT: తిరుమల శ్రీవారి దర్శనం కోసం 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం 62,129 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 21,026 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 4.13 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.