ఎస్సీ వర్గీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా మాలల ఆందోళన

ఎస్సీ వర్గీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా మాలల ఆందోళన

WGL: వరంగల్ జిల్లా కేంద్రంలోని కాశిబుగ్గ సెంటర్‌లో నేడు ఎస్సీ వర్గీకరణకు సహకరించిన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాల సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మాల కుల సంక్షేమ సంఘం సభ్యులు రహదారులపైకి వచ్చి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ నిర్ణయాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.