గస్తీ కాస్తున్న కాలనీ వాసులు

NRML: గత కొద్ది రోజులుగా నిర్మల్ జిల్లా భైంసా డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతుండడంతో స్థానికులు అప్రమత్తమవుతున్నారు. పట్టణంలోని రాహుల్ నగర్ కాలనీ వాసులు రాత్రి వేళల్లో గస్తీ కాస్తున్నారు. ప్రతి రోజు 10 మంది చొప్పున ఒక బృందంగా ఏర్పడి తెల్లవారు జామున వరకు గస్తీ కాస్తున్నారు. రాత్రి వేళల్లో అనుమానిత వ్యక్తులు వస్తే వారిని విచారిస్తున్నారు.