ముక్కామల పీహెచ్సీ వైద్యాధికారిగా సిద్ధార్థ రాయ్

ముక్కామల పీహెచ్సీ వైద్యాధికారిగా సిద్ధార్థ రాయ్

కోనసీమ: అంబాజీపేట మండలం ముక్కామల పీహెచ్సీ వైద్యాధికారిగా డాక్టర్ ఎం.సిద్దార్థ రాయ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం మరింత చేరువ చేసి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తానని తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. పలువురు గ్రామస్తులు ఆయనను కలిసి అభినందించారు.