వేంపల్లె మల్లేశ్వరుని ఆలయంలో చోరీ
KDP: వేంపల్లి పట్టణ సమీపంలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగింది. శనివారం ఆలయానికి ఉన్న తలుపులు పగలగొట్టి దొంగలు ఆలయంలోకి చొరబడ్డారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ చోరీలో దుర్గమ్మ అమ్మవారి తాళిబొట్టుతోపాటు కొన్ని వస్తువులు ఎత్తుకెళ్లినట్లు వారు వివరించారు. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.