రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
MBNR: మిడ్జిల్ మండలం బోయిన్పల్లిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాల్య లోక తండాకు చెందిన దేశ్య నాయక్ (39) మృతి చెందారు. జడ్చర్ల-కోదాడ హైవే దాటుతుండగా కల్వకుర్తి నుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.