వడదెబ్బతో మహిళ మృతి
GDWL: ఉండవెల్లి మండలంలో ఓ మహిళ వడదెబ్బతో మృతి చెందింది. మండల కేంద్రానికి చెందిన జమీలాబీ (34) గత రెండు రోజులుగా పొలం పనులకు వెళ్తుంది. ఈ క్రమంలో ఇవాళ తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు