జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరిని కలిసిన కార్పొరేటర్‌లు
కృష్ణా: విజయవాడ నగరానికి చెందిన జనసేన పార్టీ కార్పొరేటర్లు మహాదేవ అప్పాజీ, మరుపిళ్ల రాజేష్, అత్తులూరి పెదబాబు శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రాముని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలో జనసేన పార్టీ బలోపేతం కోసం ఆయనతో వారు చర్చించారు. కూటమి ధర్మానికి కట్టుబడి ఉంటూనే, నగరంలో జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు.