VIDEO: నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

యాదాద్రి: 'ప్రజా పాలన ప్రగతి బాట' కార్యక్రమంలో భాగంగా శనివారం వలిగొండ మండల కేంద్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు రేషన్ కార్డుల అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.