ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

MNCL: బెల్లంపల్లి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ దావ స్వాతి, రమేష్ బాబు పాల్గొన్నారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సేవాలాల్ మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ముందుకు సాగాలని కోరారు. పలు సమస్యలను ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తానన్నారు.