'ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం'

'ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం'

KMM: గత ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో కూర్చున్న వారు సీఎంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. నర్మెటలో నిర్వహించిన బహిరంగ సభలో తుమ్మల మాట్లాడుతూ.. ప్రభుత్వం రుణమాఫీ చేయదని ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారాలను తమ ప్రభుత్వం చేతలతో తిప్పికొట్టిందని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని అమలు చేశామని పేర్కొన్నారు.