'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో జిల్లాకు 52 అవార్డులు
KKD: 'స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర (SASA)' కార్యక్రమం కింద ఈ సంవత్సరం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 52 అవార్డులు ప్రకటించిందని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ అవార్డుల ప్రధానం కార్యక్రమం కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో రేపు మధ్యాహ్నం 3.00 గంటలకు నుంచి నిర్వహించడం జరుగుతుందని ఆయన ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు.