సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
KMM: ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్‌గా అరెస్ట్ చేస్తామని బెదిరించి, డబ్బులు డిమాండ్ చేసే సైబర్ నేరగాళ్ళ మాయమాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో సైబర్ క్రైమ్‌కు సంబంధించి రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.