బస్సు బోల్తా .. తప్పిన ప్రమాదం

బస్సు బోల్తా .. తప్పిన ప్రమాదం

KMM: దమ్మపేట మండలం గట్టు గూడెం గ్రామ శివారులో శుక్రవారం ఓ ప్రైవేటు మినీ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. స్థానిక సమాచారం మేరకు  విశాఖపట్నం నుంచి ఖమ్మం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయలు కాలేదని ప్రయాణికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై సాయి కిషోర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.