VIDEO: యూట్యూబ్‌లో చూసి హత్యకు ప్లాన్..!

VIDEO: యూట్యూబ్‌లో చూసి హత్యకు ప్లాన్..!

ప్రకాశం: బెస్తవారిపేటలో ఆదివారం దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. మామ మందలించడంతో ఆగ్రహించిన అల్లుడు పీరావలి హత్య ఎలా చేయాలని యూట్యూబ్‌లో వీడియోలు సెర్చ్ చేసి చూస్తున్నట్లు పీరావలి భార్య కరిష్మా పోలీసులకు తెలిపింది. ముందు బాబాయ్ ని హత్య చేసిన అనంతరం తన తండ్రిని హత్య చేసేందుకు ప్రయత్నించాడని, అందరూ కేకలు వేయడంతో పీరావలి అక్కడి నుంచి పారిపోయాడని పేర్కొంది.