VIDEO: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం.. నిందితుడి అరెస్ట్

ADB: S.K మైక్రో ఫైనాన్స్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన కృష్ణను, రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. బుధవారం వివరాలు వెల్లడించారు. జిల్లాలో 300 మందికి ఉద్యోగాల పేరుతో మోసం చేశారన్నారు. నిందితుని వద్దనుండి 9 లక్షల నగదు,10.7 తులాల బంగారు ఆభరణాలు, 5 ఫోన్లు, 1 ఖరీదైన వాచ్, 2 కార్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.