లక్కర్ దొడ్డిలో రోడ్డు భద్రత గ్రామసభ
NRPT: నర్వ మండలం లక్కర్ దొడ్డిలో సర్పంచ్ సుశీలమ్మ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కానిస్టేబుల్ మొగిలప్ప ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం చేపట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.