సింహాచలం ఘటన హృదయ విదారకం: పల్లా

సింహాచలం ఘటన హృదయ విదారకం: పల్లా

VSP: సింహాచలంలో ఏడుగురు మృతిచెందిన ఘటన హృదయ విదారకమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు.