బీజేపీ మద్దతుతో నేరడ సర్పంచ్‌గా నామినేషన్
NLG: చిట్యాల మండలం నేరడ గ్రామ సర్పంచ్ స్థానానికి బీజేపీ మద్దతుతో కాసోజు శంకరా చారి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు, మద్దతుదారులతో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకొని వడ్డీమర్తి క్లస్టర్ ఏఆర్వోకు నామినేషన్ అందించారు. శ్రేణులు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.