ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో బోరు వేయించిన నాయకులు

KMR: ఎల్లారెడ్డి మండలంలోని అల్మాజిపూర్ గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక నిధులతో మార్కెట్ ఛైర్మన్ రజిత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో బోరు మోటారు వేయించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ ఎన్నో రోజులుగా నీటి సమస్య ఉందని ఎమ్మెల్యే కృషి ద్వారా తమకు నీటి సమస్య పరిష్కారం అయ్యిందని ఆనందం వ్యక్తం చేసారు.