నాలా కబ్జాపై కాలనీవాసుల ఆవేదన

WGL: పుప్పాల గుట్ట, విగ్నేశ్వర కాలనీలో గురువారం కురిసిన భారీ వర్షానికి కాలనీ మొత్తం జలమయమైంది. స్థానికులు బయటకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, నాలా కబ్జాకు గురవ్వడమే ఇందుకు ప్రధాన కారణాలని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ వర్షం వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు.