VIDEO: 'గుంతతో పొంచి ఉన్న ప్రమాదం'

VIDEO: 'గుంతతో పొంచి ఉన్న ప్రమాదం'

ADB: ఆదిలాబాద్ నుంచి ప్రధాన రహదారి మీదుగా మావల మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు మార్గంపై దుర్గా నగర్ కాలనీకి వెళ్లే మూలమలుపు వద్ద గల నాలా గుంత ప్రమాదకరంగా మారింది. ఏమాత్రం అదుపుతప్పిన గుంతలో పడి ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు వాపోయారు. సంబంధిత సిబ్బంది గుంతపై స్లాబ్ లాంటి పరికరాన్ని ఏర్పరిచి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.