రేపటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు

రేపటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు

AKP: ఈ నెల 17 నుంచి 26 వరకు ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు మాకవరపాలెం ఎంపీడీవో ఛాయాసుధ ఇవాళ తెలిపారు. 17, 18న శెట్టిపాలెం, 19, 20న జీ. కోడూరు, 21, 22న మాకవరపాలెం, 24, 25న గిడుతూరు, 26న బూరుగుపాలెం పాఠశాలల్లో ఆధార్ అప్డేట్, నూతన ఆధార్ కార్డుల జారీకి క్యాంపులు నిర్వహించనున్నట్టు చెప్పారు. వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.