పార్టీకి ప్రజలే బలం.. కార్యకర్తలే ధైర్యం: మంత్రి
సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి దామోదర హజరై మాట్లాడారు. MPTC, ZPTC ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి ప్రజలే బలం, కార్యకర్తలే ధైర్యమని స్పష్టం చేశారు.