VIDEO: మున్నేటి వరదలో చిక్కుకున్న ట్రాక్టర్లు

VIDEO: మున్నేటి వరదలో చిక్కుకున్న ట్రాక్టర్లు

KMM: ముదిగొండ మండలం పెద్దమండవ మున్నేటిలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో ఇసుక తీసుకొచ్చేందుకు వెళ్లిన మూడు ట్రాక్టర్లు సహా డ్రైవర్లు చిక్కుకున్నారు. నీటి ప్రవాహం పెరుగుతుండగానే కూలీలు అప్రమత్తమై పరుగుపరుగున ఒడ్డుకు చేరారు. అప్పటికే ట్రాక్టర్ల ఇసుక లోడు చేసి ఉన్నా బయటకు తీసుకురాలేక డ్రైవర్లు సైతం బయటకు వచ్చారు. వరద ప్రవాహంలోనే మూడు ట్రాక్టర్లు నిలిచిపోయాయి.