మోదీని కలవనున్న రాహుల్ గాంధీ

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని కలవనున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ పీఎంవో కార్యాలయానికి చేరుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో పహల్గామ్ దాడికి సంబంధించిన ప్రభుత్వ చర్యలు, జమ్మూకశ్మీర్‌లోని భద్రతా పరిస్థితి, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించే అవకాశం ఉంది.