మంచినీటి అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

KKD: రామచంద్రపురం నియోజకవర్గం బాలాంతరంలో మంచినీటి చెరువు అభివృద్ధి పనులకు మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎన్నార్జీఎస్ నిధులు రూ.9.96 లక్షలతో ఈ అభివృద్ధి పనులు పూర్తి చేస్తారని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏపీవో గణపతి, ఎంపీపీ పంపన నాగమణి తదితరులు పాల్గొన్నారు.