VIDEO: భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
HYD: భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన పేట్ బషీరాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. సుచిత్ర సెంటర్ వద్ద ఉన్న ఓ టైర్ల షాపులో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసి పడటంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.