పేకాట స్థావరంపై దాడి.. 13 మంది అరెస్ట్

పేకాట స్థావరంపై దాడి.. 13 మంది అరెస్ట్

KMM: వైరా మండలం సిరిపురం డంపింగ్ యార్డ్ వద్ద పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 13మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు వైరా ఎస్సై పుష్పాల రామారావు తెలిపారు. ఆదివారం విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేయగా 13 మంది పేకాట ఆడుతూ పట్టుపడ్డారని, వారి వద్ద నుంచి రూ.4250 నగదు, 5 బైక్స్, 2 స్కూటీలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.