ప్రమాదాల నివారణకు బారికేడ్లు ఏర్పాటు

ప్రమాదాల నివారణకు బారికేడ్లు ఏర్పాటు

NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రం నుండి ఉపూర్ గ్రామానికి వెళ్లే మార్గంలో వర్షాలకు రోడ్డు కోతకు గురైన ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా ఎంపీడీవో చింతరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో ప్రయాణికులు వాహనాలను మెల్లగా నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, కార్యదర్శి గంగ జమున, ఆర్ఎ శరత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.