VIDEO: నీట మునిగిన కేఆర్ఎం కాలనీ
VSP: మోంథా తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం విశాఖపట్నం నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని కే.ఆర్.ఎం. కాలనీలోకి భారీగా వర్షపు నీరు చేరింది. ప్రధాన డ్రైనేజీలు పొంగి లోతట్టు ప్రాంతంలో ఉన్న అనేక ఇళ్లలోకి నీరు చొచ్చుకు రావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా పరిస్థితి విషమంగా మారింది.