పండ్రేగుపల్లి- బోనకల్ రోడ్డుపై రాకపోకలు నిలిపివేత

ఖమ్మం: ముదిగొండ మండల పరిధిలోని మున్నేరులో ఏర్పాటు చేసిన పండ్రేగుపల్లి- బోనకల్ తాత్కాలిక రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు. మున్నేరు వద్ద వరద తీవ్రత పెరిగి తాత్కాలిక రహదారిపై నుంచి ప్రవహిస్తుందని చెప్పారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు