VIDEO: ములుగు పల్లెలను కప్పిన మంచు దుప్పటి

VIDEO: ములుగు పల్లెలను కప్పిన మంచు దుప్పటి

ములుగు జిల్లాలోని పల్లెలు శుక్రవారం ఉదయం దట్టమైన మంచు కప్పేసింది. జిల్లాలోని గ్రామంలో మంచు అలుముకుంది. ఉదయం 10 గంటలు దాటినప్పటికీ మంచు తొలగకపోవటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించక, హెడ్‌లైట్ల వెలుతురులో మాత్రమే ప్రయాణిస్తున్నారు. అలాగే, వ్యవసాయ పనులు చేయడానికి వెళ్లేవారు సైతం ఇబ్బందులు తప్పడం లేదు.