VIDEO: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం: కలెక్టర్
MBNR: జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో సోమవారం పిల్లల భద్రతకై మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ కుష్బూ గుప్తా మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని సూచించారు. పిల్లలు, మహిళలపై జరిగే వేధింపులకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. జిల్లా ఎస్పీ, అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.