VIDEO: ఇటిక్యాల రహదారిలో కల్వర్టుల సమస్య
GDWL: ఇటిక్యాల మండల కేంద్రం నుంచి 44వ జాతీయ రహదారికి వెళ్లే మార్గంలోని కల్వర్టుల వెడల్పు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు ప్రమాదాలు చోటుచేసుకునే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ గోడలు శిథిలావస్థకు చేరాయని తెలిపారు. వెంటనే మరమ్మతులు చేసి కల్వర్టులను విస్తరించి ప్రమాదాలను నివారించాలని అధికారులను కోరారు.