మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి
SRPT: మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,546 క్యూసెక్కుల నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు శనివారం మూడు గేట్లను ఎత్తి 2,688 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 644 అడుగుల వద్ద నీరు నిల్వ ఉందని తెలిపారు.