VIDEO: కడపలో పట్టాభి దిష్టిబొమ్మ దహనం
కడపలోని YCP కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ CM YS జగన్‌పై TDP నేత పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ... మండిపడ్డారు. పట్టాభిరామ్ దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగిస్తూ నిరసన చేపట్టారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.