అలీ తలాబ్‌లో గుర్రపుడెక్క తొలగింపు
HYD: జలవనరులకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు సైబరాబాద్ యంత్రాంగం నడుం బిగించింది. నిరుపయోగంగా మారి, కాలుష్య కోరల్లో చిక్కుకొన్న చెరువులను పునరుద్ధరించే పనిలో భాగంగా గుర్రపుడెక్క తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రధానంగా అంబీర్ చెరువు, అలీ తలాబ్‌లలో అలుముకున్న గుర్రపుడెక్కను తొలగించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులు కొనసాగుతున్నాయి.